Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘పబ్ జీ’కి బానిసైన వివాహిత.. విడాకులు ఇస్తే గేమ్ పార్టనర్ ను పెళ్లిచేసుకుంటానని మొండిపట్టు!

  • గుజరాత్ రాష్ట్రంలో విచిత్ర ఘటన
  • పబ్  జీ కారణంగా భార్యాభర్తల మధ్య విభేదాలు
  • పునరావాస కేంద్రానికి వెళ్లేందుకు యువతి నో
స్మార్ట్ ఫోన్ గేమ్ పబ్ జీ గేమ్ కు బానిసలు అవుతున్న యువత తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటోంది. పబ్ జీ గేమ్ కు బానిసైన చాలామంది విద్యార్థులు మానసిక సమస్యలతో ఇటీవల ఆత్మహత్యలు చేసుకున్నారు. తాజాగా పబ్ జీ కి బానిసైన ఓ వివాహిత భర్తకు విడాకులు ఇచ్చేస్తానని మొండిపట్టు పట్టి కూర్చుంది. పబ్ జీ గేమ్ లో తన పార్ట్ నర్ తోనే కలిసి ఉంటానని ఆమె స్పష్టం చేసింది. దీంతో ఆమెకు కౌన్సెలింగ్ నిర్వహించిన అధికారులు మరోసారి ఆలోచించుకోవాలని కోరారు.

గుజరాత్ కు చెందిన ఓ వివాహిత(19) పబ్ జీ గేమ్ ను బాగా ఆడేది. ఈ క్రమంలో ఆటలో పరిచయమైన మరో యువకుడిని ఆమె ప్రేమించింది. అతడితోనే కలిసి ఉంటాననీ, తనకు విడాకులు ఇప్పటించాలని ఉమెన్స్ హెల్ప్‌లైన్ ‘అభయం -181’కు ఫోన్ చేసి కోరింది. దీంతో అధికారులు ఆమె కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. దీంతో తమ కోడలు పబ్ జీ బానిస కావడంతో కొడుకు దాంపత్యంలో విభేదాలు ఏర్పడ్డాయని వారు చెప్పారు.

ఈ విషయమై అభయ్ ప్రాజెక్టు చీఫ్ గోహిల్ మాట్లాడుతూ.. తమకు రోజుకు ఈ తరహా కాల్స్ 550 వరకూ వస్తుంటాయనీ, అయితే పబ్ జీ కారణంగా విడాకులు కోరిన కేసు మాత్రం ఇదే మొదటిదని తెలిపారు. పబ్ జీ అలవాటును తప్పించేందుకు ఆమెను అహ్మదాబాద్ లోని పునరావాస కేంద్రానికి తరలిస్తామని చెప్పగా, అక్కడ ఫోన్లను అనుమతించరని తెలుసుకున్న యువతి, వెళ్లేందుకు నిరాకరించిందని చెప్పారు. విడాకుల విషయంలో మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని సదరు యువతి చెప్పిందని పేర్కొన్నారు.
pubji
divorce
Gujarat
Police

More Telugu News